Wednesday, May 15, 2013

Tadakha movie review
మాస్ హీరోగా తడాఖా చూపేందుకు నాగచైతన్య తహతహ!


మిళంలో ఘన విజయం సాధించిన చిత్రం ‘వైట్టై’! దీనిని మొదట తెలుగులో అనువదించాలనుకున్నారు  ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేశ్ . అయితే తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా కాస్త మార్పులూ చేర్పులూ చేసిరీ-మేక్ చేస్తే బాగుంటుందన్న ఆలోచన కలగడంతో అందుకు సిద్ధపడి, ‘తడాఖాగా తెలుగులో పునర్ నిర్మించారువిశేషం ఏమంటే… రీ-మేక్ కోసం బెల్లంకొండ ఎంచుకున్న టీమ్ ను చూస్తే విచిత్రంగా అనిపిస్తుంది. ‘దడ’, ‘బెజవాడ’ చిత్రాల పరాజయంతో రేస్ లో వెనకబడిన నాగచైతన్య ఇందులో హీరో. ‘మిస్టర్ పెళ్ళికొడుకు’ తో హిట్ కొడతాడని భావించినాకొట్టలేకపోయిన సునీల్ రెండో హీరోఇక అప్పుడెప్పుడో ‘కొంచెం ఇష్టం కొంచెం కష్టం’ సినిమాతో డైరెక్టర్ గా మెగాఫోన్ పట్టిన కిశోర్ కుమార్ (డాలీదర్శకుడుఈ ముగ్గురి కాంబినేషన్ కు ఏ రకంగానూ క్రేజ్ అనేది లేదుఅయితే వరుస విజయాలు సాధిస్తూకథానాయికగా అగ్రస్థానం వైపు దీసుకెళుతున్న తమన్నా ఒక్కతే కాస్త ఊరటపైగా నాగ చైతన్యతమన్నా కలిసి గతంలో హండ్రెండ్ పర్సంట్ లవ్’ అనే ఓ హిట్ మూవీ చేశారు కాబట్టి.  ఆ చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకోవచ్చని నిర్మాత బెల్లంకొండ సురేశ్ భావించి వుండొచ్చు.
మొత్తం మీద కాస్త ఆలస్యంగా అయినా… ‘తడాఖా’ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చేసిందిపోలీస్ అధికారి నాగబాబుకు ఇద్దరు కొడుకులు పెద్దవాడు సునీల్పరమ భయస్తుడురెండోవాడు నాగ చైతన్య యమా యాక్టివ్చిన్నకొడుకు చురుకైన వాడు కావడంతో అతని గురించి తండ్రికి ఏ బెంగాలేదుపెద్దోడు ఎలా పెరుగుతాడన్నదే ఆయన భయంఅనుకోకుండా హార్ట్ ఎటాక్ తో నాగబాబు చనిపోతాడుఇక అన్నయ్య బాధ్యతను కూడా తమ్ముడే భుజం మీద వేసుకుంటాడుతండ్రి సర్వీస్ లో చనిపోయాడు కాబట్టి పెద్ద కొడుకుగా సునీల్ కు పోలీస్ ఉద్యోగం వస్తుందినిజానికి అతని మనస్తత్వానికి ఏమాత్రం సరిపడని ఉద్యోగం అదిఅయినా తమ్ముడు బలవంతం చేయడంతో సరే అంటాడుపోస్టింగ్ తీసుకుని ఉద్యోగంలో జాయిన్ అయిపోతాడుఅక్కడి నుండే అసలు కథ మొదలువుతుందిఅతనికి పోస్టింగ్ వచ్చిన చోట రౌడీలదే రాజ్యంవాళ్లు చెప్పిందే న్యాయం, చేసిందే చట్టంసునీల్ రాకతో అక్కడ రౌడీయిజానికి ఫుల్ స్టాప్ పడుతుందిప్రజలలో పోలీసుల పట్ల గౌరవంనమ్మకం పెరుగుతాయి.
ప్రతి చిన్న విషయానికీ భయపడే సునీల్ రౌడీలకు ఎలా చెక్ చెప్పాడుసునీల్ చూపిన ‘తడాఖా’ వెనక తమ్ముడి    పాత్ర ఏమిటి?  అన్నదమ్ములు కలిసి ఆడిన నాటకం ఎప్పుడు, ఎలా బైట పడిందిదానిని తిరిగి వీరిద్దరూ ఎలా ఎదుర్కొన్నారుఅన్నదే మిగతా కథ!
ఖాకీ డ్రస్ లో ఉండి అన్న చేయాల్సిన డ్యూటీనిఆ డ్రస్ వేసుకోకుండానే తమ్ముడు చేయడమే ఈ సినిమాలోని ప్రధానమైన అంశంఅయితే ఆ విషయం తెలుసుకున్న తర్వాత రౌడీలు వీళ్ళకు ఎలా చెక్ చెప్పారు అనే అంశం మాత్రం పూర్తిగా తేలిపోయిందితమిళంలో లింగుస్వామి ఈ తరహా కథలను తయారు చేయడంలో దిట్టకానీ ఈ సారి ఆ ఆట రంజుగా సాగలేదుతమిళంలో నటీనటులకు ఉన్న ఇమేజ్ కారణంగా అక్కడ బాగా ఆడి ఉండొచ్చు కానీతెలుగులో మాత్రం సినిమా చతికిలబడిపోయిందిప్రతి సన్నివేశాన్ని అవసరమైన మేరకు భారీగా తీసినా, ఓ ఏదో అసంతృప్తి థియటర్ లో కూర్చున్న ప్రేక్షకుడికి కలుగుతుందిముఖ్యంగా నాగబాబు పెద్ద కొడుకుగా సునీల్ ను ఊహించుకోగలంకానీ సునీల్నాగచైతన్య లను అన్నదమ్ములుగా పక్క పక్క చూడటం కష్టంగా అనిపిస్తుందిసగం సినిమా గడిచినా ఆయా పాత్రలలో వారిని ఊహించుకోలేంఇక సునీల్ ధైర్య సాహసాలు గురించి విని, పెళ్ళి చేసుకున్న ఆడ్రియాకు నిజం ఎలా తెలిసింది, ఆమె దానిని ఎలా జీర్ణించుకుంది అనేది దర్శకుడు సరిగా ఎస్టాబ్లిష్ చేయలేదునాగచైతన్య, తమన్నా లవ్ ట్రాక్ సైతం ఎబ్బెట్టుగా ఉందిఎన్ ఆర్ ఐ గా వచ్చిన వెన్నెల కిషోర్ పై చిత్రీకరించిన సన్నివేశాలన్నీ పాతచింతకాయ పచ్చడేతమన్ బాణీలు సోసో గానే ఉన్నాయి. అయితే నేపథ్య సంగీతం మాత్రం సూపర్ప్రతి చిన్న అంశానికీ ప్రాధాన్యం ఇచ్చారునటీనటుల నటన గురించి చెప్పుకోవడానికి ఏం లేదు విలన్ల చేతిలో దెబ్బలు తిన్న డమ్మీ పోలీస్ నిజం పోలీస్ గా మారిన క్రమాన్ని హత్తుకునేలా చూపించలేకపోయారుఅలానే సిక్స్ ప్యాక్ బాడీ ఉన్న సునీల్ ను క్లయిమాక్స్ లో సరిగా ఉపయోగించుకోలేదుబహుశా నాగచైతన్యను డామినేట్ చేస్తాడనే భయమేమో తెలియదుచివరగా సినిమా థియేటర్ నుండి బయటకు వస్తుంటే ప్రేక్షకులకు ఏ భావన కలగదు.  రెండున్నర గంటల సేపు చూసిన సినిమాలోని  ఏ ఒక్క సన్నివేశమూ మళ్ళీ తలుచుకోవాలని పించదువెళ్ళాం.. చూశాం… వచ్చాం అనే అనిపిస్తుంది. నాగచైతన్య లవర్ బోయ్ మాత్రమే కాదు… ఫైట్స్ కూడా చేయగలడు అని నిరూపించడానికి చేసిన ప్రయత్నమే ‘తడాఖా’ తప్పితే ఇందులో ప్రత్యేకత ఏమీ లేదు.

No comments:

Post a Comment