Friday, November 18, 2011
Monday, November 14, 2011
నిను మరువలేము మిత్రమా!
చిల్డ్రన్స్ ఫిలిం ఫెస్టివల్ వచ్చింది... ఉమేశ్ లేడు!
ఎప్పటిలానే రెండేళ్లకు ఒకసారి వచ్చే
బాలల చలన చిత్రోత్సవం వచ్చేసింది.
కానీ మిత్రుడు ఉమేశ్ మాత్రం లేడు!
పాత్రికేయుడిగా అతని బీట్ ఏదైనా..
చలన చిత్రోత్సవాల్లో పాల్గొనటం అతనికి ఇష్టం!
చిన్నారి పిల్లలతో కలిసి సినిమాలు చూడటం మరీ ఇష్టం!!
ఒకే పత్రికలో పనిచేస్తూ కూడా బిజీ షెడ్యూల్ కారణంగా
ఆఫీసులో కలిసినా కలవక పోయినా
ఫిలిం ఫెస్టివల్ జరిగే వారం రోజుల్లో
కనీసం మూడు రోజులైనా కలిసేవాళ్ళం.
చూసిన, చూడబోయే సినిమాలను గురించి ముచ్చటించుకునే వాళ్ళం.
తాను చూసిన మంచి సినిమాల గురించి గొప్పగా చెప్పేవాడు.
అవి ఏ భాషా చిత్రాలైనా భుజానికి ఎత్తుకుని మోసేవాడు.
తప్పకుండా చూడమని సూచించే వాడు.
దాదాపు పన్నెండు ఏళ్లుగా అతను హాజరుకాని ఫిలిం ఫెస్టివల్ లేదేమో!
ఇప్పుడు మరోసారి చిల్డ్రన్స్ ఫిలిం ఫెస్టివల్ వచ్చింది.
ఉమేశ్ మాత్రం లేడు.
అలవాటుకొద్దీ అతని కోసం నలువైపులా కళ్ళు వెదుకుతుంటే...
'అతను నా దగ్గర వున్నడులే' అని మనసు ఊరడిస్తోంది!!
చలన చిత్రోత్సవ ప్రేమికుడు, మిత్రుడు
ఉమేశ్ కు
అశ్రునయనాలతో...
Sunday, November 13, 2011
Subscribe to:
Posts (Atom)