Showing posts with label కలగూరగంప. Show all posts
Showing posts with label కలగూరగంప. Show all posts
Tuesday, February 11, 2025
Sunday, January 7, 2024
Wednesday, August 2, 2023
Karthik with Martinoz
కుర్రాళ్ళోయ్... కుర్రాళ్ళు!
జూన్ 29న మా రవి పాడి బావ ఫోన్ చేసి... ‘మీ మేనల్లుడు ప్రణీత్ పూనే లోనే ఉన్నాడా?’ అని అడిగారు. వాడికి ఫోన్ చేస్తే... అంబర్ నాథ్ లో వాళ్ళ పాప మొక్కులు తీర్చుకునే పనిలో ఉన్నానని చెప్పాడు. అదే మాట బావకు చెప్పాను. ‘సర్లే... నా పని బెంగళూరుకు మారిందన్న మాట’ అని చెప్పి ఫోన్ కట్ చేశారు. ఆ తర్వాత పదిరోజులకు నా వాట్సప్ కు ఓ ఫోటో వచ్చింది. అందులో రవి పాడి బావ వాళ్ళ పెద్దబ్బాయి కార్తికేయ అర్జెంటీనా గోల్ కీపర్ ఎమిలియానో మార్టినెజ్ తో దిగిన ఫోటో ఉంది. దాన్ని చూడగానే నేను ఆశ్చర్యపోయాను... మా అబ్బాయి కార్తికేయకు దాన్ని చూపిస్తే... ‘కార్తీక్ అన్న... మార్టినెజ్ తో ఫోటో దిగాడా? ఆయన ఎంత గొప్ప ఫుట్ బాల్ ప్లేయరో తెలుసా?’ అనేశాడు.
నిజం చెప్పాలంటే... ఆ క్షణం వరకూ నాకు ఎమిలియానో మార్టినెజ్ గురించి ఏమీ తెలియదు. అదే మాటను మా రవి పాడి బావతో చెబితే, అర్జెంటీనా దేశాన్ని విశ్వవిజేతగా నిలపడంలో మార్టినెజ్ పాత్ర ఏమిటనేది ఆయన వివరిస్తే... నోరెళ్ళబెట్టాను. మా బావ కొడుకు కార్తికేయ ప్రస్తుతం డాక్టర్ బి. వి. రాజు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఇంజరీనింగ్ చదువుతున్నాడు. చిన్నప్పటి నుండి ఫుట్ బాల్ ప్లేయర్. స్కూల్ లోనూ, కాలేజీలోనూ ఫుట్ బాల్ ఆడాడు. సంగీతమంటే అభిరుచి ఉన్న కార్తికేయ రాయల్ స్కూల్ ఆఫ్ మ్యూజిక్ (లండన్)లో ఓకల్ వెస్ట్రన్, పియానో 5వ గ్రేడ్ ఉత్తీర్ణత కూడా సాధించాడు.
ఇక జూలై ఫస్ట్ వీక్ మార్టినెజ్ కోల్ కతాలోని మోహన్ బగాన్ క్లబ్ లో జరిగే ఓ ప్రైవేట్ ఈవెంట్ కు వస్తున్నాడని తెలుసుకున్న మా బావ కొడుకు కార్తికేయ అక్కడకు వెళ్ళి మార్టినెజ్ ను కలుసుకుని, 2022 వరల్డ్ కప్ రిప్లికా తో ఫోటో దిగాడు. అర్జంటీనా జెర్సీపై ఆటోగ్రాఫ్ కూడా తీసుకున్నాడు. హైదరాబాద్ నుండి ఓ ఫుట్ బాల్ క్రీడాకారుడు తనను కలుసుకోవడానికి కోల్ కతా వచ్చాడని తెలుసుకున్న మార్టినెజ్ కూడా కార్తీకేయను చక్కగా రిసీవ్ చేసుకున్నాడు. కార్తికేయలోని ఈ ఉత్సాహం, చొరవ, తెగింపు చూసిన తర్వాత అప్పుడెప్పుడో ‘అందమైన అనుభవం’ సినిమాలోని ‘’కుర్రాళ్ళోయ్ కుర్రాళ్ళోయ్ కళ్ళాలే లేనోళ్ళు’’ అనే పాట గుర్తొచ్చింది.
ఇంతకూ జూన్ నెలాఖరులో మా బావ నాకు పూనేలో పనుందని ఫోన్ చేసింది అక్కడ నుండి అర్జెంటీనా జెర్సీని తెప్పించడానికట! ఆ రోజు మా మేనల్లుడు పూనే లో లేకపోవడంతో... బెంగళూరులో తెలిసినవాళ్ళకు ఫోన్ చేసి... హుటాహుటిన అక్కడ నుండి హైదరాబాద్ కు జెర్సీ తెప్పించి, తన కొడుక్కి ఇచ్చి, కోల్ కతా పంపారన్న మాట!!
Tuesday, March 7, 2023
Tuesday, May 31, 2022
Monday, April 19, 2021
Sunday, January 3, 2021
Saturday, January 2, 2021
Tuesday, December 8, 2020
Tuesday, April 21, 2020
Monday, November 18, 2019
Sunday, October 13, 2019
Vendichandamamalu press note
వెండితెర నవలలపై ఇది ఓ పరిశోధన! - ప్రముఖ దర్శకులు, రచయిత వంశీ
సీనియర్ ఫిల్మ్ జర్నలిస్టులు పులగం చిన్నారాయణ, వడ్డి ఓంప్రకాశ్ నారాయణ రాసిన 'వెండి చందమామలు' పుస్తకాన్ని బుధవారం హైదరాబాద్ లో ప్రముఖ దర్శకుడు, రచయిత వంశీ ఆవిష్కరించారు. ఈ పుస్తకం తొలి కాపీని దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారి రవిప్రసాద్ పాడి అందుకున్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ రెంటాల జయదేవ, పుస్తక రూపశిల్పి సైదేశ్ పాల్గొన్నారు.
సీనియర్ ఫిల్మ్ జర్నలిస్టులు పులగం చిన్నారాయణ, వడ్డి ఓంప్రకాశ్ నారాయణ రాసిన 'వెండి చందమామలు' పుస్తకాన్ని బుధవారం హైదరాబాద్ లో ప్రముఖ దర్శకుడు, రచయిత వంశీ ఆవిష్కరించారు. ఈ పుస్తకం తొలి కాపీని దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారి రవిప్రసాద్ పాడి అందుకున్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ రెంటాల జయదేవ, పుస్తక రూపశిల్పి సైదేశ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వంశీ మాట్లాడుతూ, "1950, '60, '70 లలో తెలుగునాట వెండితెర నవలలు ఓ వెలుగు వెలిగాయి. వాటిల్లో నాకు గురువుగారు ముళ్ళపూడి వెంకట రమణ రాసిన పుస్తకాలు ఇష్టం. నేను కూడా ఓ నాలుగు వెండితెర నవలలు రాశాను. అందులో 'తాయారమ్మ - బంగారయ్య' మాత్రం పబ్లిష్ కాలేదు. మిగిలినవి పుస్తక రూపంలో వచ్చాయి. నేను రాసిన వెండితెర నవలల్లో బాగా పాపులర్ అయ్యింది 'శంకరాభరణం' వెండితెర నవల. ఆ పాపులారిటీకి కారణం నేను రాసిన విధానం కాదు, అంత గొప్పగా ఆ సినిమాను మా గురువుగారు కె. విశ్వనాథ్ తెరకెక్కించారు. ఇలా తెలుగులో ఉన్న అనేక వెండితెర నవలల మీద ఇలాంటి పరిశోధనాత్మక రచన ఇంతకు ముందు నాకు తెలిసి ఎవరూ రాయలేదు, రాలేదు. ఇవాళ పులగం చిన్నారాయణ, మిత్రుడు ఓం ప్రకాశ్ నారాయణ ఈ పుస్తకాన్ని తీసుకొచ్చారు. ఇది పుస్తక రూపంలోకి రాక ముందు నుండి వీరు చేస్తున్న పరిశోధన గురించి నాకు తెలుసు. ఎవరెవరి దగ్గర వీరు సమాచారం
సేకరిస్తున్నారు? ఎంతగా శ్రమ పడుతున్నారనేది ఓ అవగాహన ఉంది. ఈ పుస్తకంలో ఏ వెండితెర నవల ఎవరు రాశారు, అది ఎప్పుడు విడుదలైందనే పట్టిక కూడా ఇచ్చారు. ఇంత చక్కని పుస్తకం మంచి పాపులారిటీని తెచ్చుకుని, వెంటనే రీప్రింట్‌కు రావాలని ఆశిస్తున్నా'' అని అన్నారు.
రైల్వే అధికారి, సాహితీ విశ్లేషకులు రవిప్రసాద్ పాడి మాట్లాడుతూ, "సినిమా పబ్లిసిటీలో భాగంగా పాత రోజుల్లో పాటల పుస్తకాలు, గ్రామ్‌ఫోన్ రికార్డులు, వెండితెర నవలలు వస్తుండేవి. అలా తెలుగు సినిమా తొలినాళ్ళలో వచ్చిన వెండితెర నవలల నుండి, నిన్నమొన్నటి 'శ్రీరామరాజ్యం', 'టెంపర్' వరకూ వచ్చిన అనేక రచనల వివరాలను పరిశోధించి, ఈ 'వెండి చందమామలు' రాయడం సంతోషాన్నిస్తోంది.
ఇలాంటి రచనలు ఇంకా రావాల్సిన అవసరం ఉంది'' అన్నారు.
సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ రెంటాల జయదేవ మాట్లాడుతూ, ''తెలుగు సినీరంగానికి సంబంధించి ఇటీవల వచ్చిన అరుదైన పుస్తకాల్లో ఒకటిగా "వెండి చందమామలు' నిలబడిపోతుంది. ఒక తరానికి తీపి జ్ఞాపకంగా, ఇప్పుడు కేవలం స్మృతిచిహ్నంగా మిగిలిపోతున్న వెండితెర నవలల మీద ఒక పరిశీలన, ఒక పరిశోధనగా ఈ రచన సాగింది. ఈ రచనలోని విషయమే కాదు, వినూత్నమైన సైజులో, అందంగా దాన్ని తీర్చిదిద్దిన విధానం కూడా ఆకట్టుకుంటుంది. ఈ చిరు పుస్తకం చదువుతుంటే మనం మళ్ళీ అరవైల్లోకి, డెబ్భైల్లోకి వెళ్ళిపోతాం. ఈ పుస్తకాన్ని ప్రతి ఒక్కరూ కొని చదవాలి. పెట్టిన ప్రతి రూపాయికీ విలువనిచ్చే పుస్తకం. సినీ ప్రేమికుల అందరి ఇళ్ళలోనూ ఉండాల్సిన పుస్తకం'' అని అన్నారు.
పుస్తక రచయితల్లో ఒకరైన పులగం చిన్నారాయణ మాట్లాడుతూ, "ఇరవై ఏళ్ళుగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేసినా కలగని తృప్తి సినీరంగానికి సంబంధించిన రచనలు చేయడంతో నాకు ఎక్కువ కలిగింది. గతంలో నేను రాసిన పుస్తకాలకూ, ఇప్పటి ఈ పుస్తకానికీ ప్రేరణ వంశీ గారే! నేను తొలి నంది అవార్డును అందుకున్న పుస్తకం 'ఆనాటి ఆనవాళ్ళు'కు ఆ పేరు సూచించింది కూడా వంశీ గారే. అలానే 'వెండితెర
నవల'పై పుస్తకం రాయమని నాకు, మిత్రుడు ఓంప్రకాశ్‌కు సలహా ఇచ్చింది కూడా ఆయనే. ఆయన లాంటి గొప్ప వ్యక్తితో నాకు అనుబంధం ఏర్పడడం జర్నలిస్ట్ గా గొప్ప ఎఛివ్‌మెంట్ గా భావిస్తుంటాను. ఈ 'వెండి చందమామలు' రచనను తొలిసారి 'పులగమ్స్' అనే పేరుతో సొంతంగా ప్రచురించాను. రెండో పుస్తకంగా ఇళయరాజా గురించి వంశీ రాసిన 'స్వప్నరాగలీనమ్'ను ప్రచురించాలని భావిస్తున్నా'' అని అన్నారు.
ఈ పుస్తకావిష్కరణ సందర్భంగా వడ్డి ఓంప్రకాశ్ మాట్లాడుతూ, "మూడు దశాబ్దాలుగా జర్నలిస్టుగా, అందులో దాదాపు ఇరవై ఏళ్ళుగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా సాధించింది ఏమిటీ? అని వెనుదిరిగి చూసుకుంటే... గొప్పగా చెప్పుకోవడానికి ఏమీ కనిపించలేదు. ఓ కథాసంపుటిని, కార్టూన్ల పుస్తకాన్ని వేయడం తప్పితే... సినిమా రంగంతో ఉన్న అనుబంధాన్ని అక్షరీకరించలేకపోయాననే బాధ ఉంటుండేది. దానిని మిత్రుడు పులగం చిన్నారాయణ కారణంగా తీర్చుకోగలిగాను. అతని సూచనతోనే గతంలో మేం రాసిన 'వెండితెర నవల'లకు
సంబంధించిన వ్యాసాన్ని మరిన్ని వివరాలతో, విస్తరించి 'వెండి చందమామలు' పేరుతో పుస్తకంగా తీసుకురాగలిగాం. ఈ పుస్తకంలో కేవలం వెండితెర నవలల గురించి రాయడమే కాకుండా, స్వర్గీయ ముళ్ళపూడి వెంకట రమణ మొదలు 'నవోదయ' రామ్మోహనరావు, శ్రీరమణ, వేమూరి సత్యనారాయణ, సింగీతం శ్రీనివాసరావు వంటి పెద్దల అభిప్రాయాలు పొందుపరిచాం. ఇంతవరకూ వచ్చిన వెండితెర నవలల జాబితాను కూడా ఇచ్చాం. పరిశోధనా గ్రంథాన్ని తలపించే ఈ పుస్తకం అందరి మన్ననలూ పొందుతుందనే నమ్మకం ఉంది'' అని అన్నారు. ఈ పుస్తకాన్ని అందంగా తీర్చిదిద్దిన ఆర్టిస్ట్ సైదేశ్ ఈ సందర్భంగా తన కృతజ్ఞతలు తెలియచేశారు.
Friday, September 13, 2019
Wednesday, April 10, 2019
Saturday, November 3, 2018
Saturday, June 23, 2018
Subscribe to:
Posts (Atom)

.jpeg)
.jpeg)



































