కొత్త సంవత్సరంలో ఊహించని విధంగా ఓ గొప్ప అనుభూతికి లోనయ్యాను!
పరమవీర చక్ర అవార్డు గ్రహీత బానా సింగ్ గారిని 'పరమవీర చక్ర' దర్శకులు దాసరి నారాయణ రావు గారి దగ్గరకు తీసుకెళ్ళే అవకాశం మిత్రులు సుబ్బారావు, వెంకటేష్ తో పాటు నాకూ లభించింది....
ఆ సందర్భంగా బానా సింగ్ గారితో దిగిన ఫోటో ఇది.
1987లో బానా సింగ్ సియాచిన్ శిఖరం పై పాక్ ఆధీనంలో ఉన్న 'ఖైద్ పోస్ట్' ను ప్రాణాలకు తెగించి పోరాడి తిరిగి భారత దేశ వశం చేశారు. మైనస్ 40 డిగ్రీస్ లో ఆయన తన తోటి సైనికులతో కలిసి సియాచిన్ శిఖరం పై ఉన్న పాక్ సైనికులతో పోరాడారు. 1988 జనవరి 26 న కేంద్ర ప్రభుత్వం బానా సింగ్ ను పరమవీర చక్ర బిరుదుతో సత్కరించింది. ఇప్పుడు సియాచిన్ శిఖరం పై ఉన్న ఆ పోస్ట్ కు 'బానా పోస్ట్' అనే పేరు పెట్టారు.
ఓ సినిమా రిపోర్టర్ గా వెండితెర పరమ వీర చక్ర (బాలకృష్ణ) ను చాలాసార్లే కలిసాను. కాని రియల్ పరమవీర చక్రను కలవడం ఇదే మొదటిసారి. ఆయనతో కరచాలనం చేసినప్పుడు రోమాలు నిక్కబొడుచుకున్నాయి.
అదో అనిర్వచనీయమైన అనుభూతి.
జై జవాన్!
very nice sir. keep it up.
ReplyDelete