సీనియర్ జర్నలిస్ట్ శ్రీ కందర్ప రామచంద్రరావు గారు (80) ఈ నెల 17న పరమపదించారు. 1950 ప్రాంతంలో జాగృతిలో సహా సంపాదకులుగా పాత్రికేయ జీవితం ప్రారంభించిన రామచంద్రరావు గారు ఆ తర్వాత 1975 లో ఆంధ్రపభలో సంపాదక మండలిలో పనిచేశారు. మొన్నటి వరకు గాయత్రి పరివార్ పత్రిక యుగశక్తి గాయత్రీకి సంపాదకులుగా వ్యవహరించారు. వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు... ఏ పౌరాణిక విషయాన్నైనా పామరులకు సైతం అర్ధమయ్యేలా రాయగలగడం ఆయన గొప్పతనం. చివరి శ్వాస వరకు రచనల్ని కొనసాగిస్తూనే వున్నారు. ఆంగ్లం నుండి తెలుగులోకి, హిందీ నుండి తెలుగులోకే కాదు స్వయంగా ఆంగ్లంలోనూ రచనలు చేశారు. పండిత్ దీనదయాల్ ఉపాద్యాయ ప్రవచించిన 'ఏకాత్మ మానవతా వాదం' ను 'ఇంటిగ్రల్ హ్యుమనిజం' పేరుతో ఆంగ్లంలో రాశారు.
జర్నలిస్టుగా నా జీవితాన్ని ప్రారంభించినపుడు ఎంతో సహనంతో సలహాలను ఇచ్చిన గురువులలో కందర్ప గారూ ఒకరు. ఎప్పుడు ఎక్కడ కనిపించినా 'ఎలా వున్నావ్, ఎక్కడ వున్నావ్' అంటూ ఆప్యాయంగా భుజంతట్టి అభినందించే వారు.
ఆ విద్వన్మణి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నాను.

No comments:
Post a Comment