Sunday, September 20, 2009

లోకల్ ట్రైన్ బాగోతం - కార్టూన్లు!


ముంబాయిలో వుద్యోగం చేసిన సమయంలో లోకల్ ట్రైన్ అనుభవాన్ని ఇలా కార్టూన్ రూపంలో కాగితంపై పెట్టాను... ఇప్పుడు ఈ పరిస్థితి హైదరాబాద్ లోను వుంది...

ఈనాడు ఫిలిం రివ్యూ






Wednesday, September 16, 2009

లేడీ కండక్టరు!

హైదరాబాద్ లో లేడీ కండక్టర్ లను అపాయింట్ చేసినప్పుడు గీసిన కార్టూన్లు...

'ఆత్మావలోకనం' కధ




ఈనాడు ఆదివారం అనుబంధం లో ప్రింట్ అయిన కధ...

Saturday, September 12, 2009

Sunday, September 6, 2009

అడవిలో అదృశ్యమైన మనీషి!


మూడు రోజులుగా గుండెల్ని ఎవరో పిండేస్తున్న బాధ...
చెట్టంత మనిషి అడవిలో చటుక్కున మాయమై పోవడం ఏమిటనే ఆవేదన...
ఎందుకిలా జరిగిందనే ఆక్రోశం...
'ఆయన బాగున్నారు ... ఇదిగో వస్తున్నారు... అదిగో వస్తున్నారు' అంటూ
కాకమ్మ కధలు చెప్పిన మీడియా
మీద పిచ్చ కోపం....
తండ్రి చనిపోతే ఎంత మంది ఆత్మహత్య చేసుకుంటారు....
తల్లి చనిపోతే ఎంతమంది ప్రాణత్యాగానికి సిద్ధపడతారు...
భార్య చనిపోతే ఎంతమంది అసువులు బాస్తారు...
ఇదేమిటీ వింత...
ఒక్కడు... ఒకే ఒక్కడు మరణిస్తే....

ఇంత మంది గుండెలు ఆగి పోవడం ఏమిటి...
వారికి, అతనికి మధ్య వున్న సంబంధం ఏమిటి...
అతను ఆత్మీయ బంధువా... ఆత్మ బంధువా...
అంతకు మించి ఇంకేమైనానా....

చెరగని చిరునవ్వు ఆభరణంగా ధరించిన వాడు...
నిండైన పంచెకట్టుతో నిటారుగా నిలిచేవాడు...
రాజసాన్ని నిలువెల్లా నింపుకున్న వాడు...

అతడే వారికి తల్లి... తండ్రి... దైవం...
తమ బాధలను ఆలకించే దేవుడే
తమని వదిలి పోయాడనే ఈ అలజడి...

ఐతే ఈ మహాభినిష్క్రమణ వెనుక
ఎన్నో జవాబు లేని ప్రశ్నలు...