Monday, August 24, 2009

హృదయ వేదన!


రెండేళ్ళ క్రితం ఆగష్టు ఇరవై ఐదున హైదరాబాద్ వాసులకు కాళ రాత్రి... లుంబిని పార్కులో , గోకుల్ చాట్ లో ఉగ్రవాదులు పెట్టిన బాంబ్ కారణంగా నలభై మంది చనిపోయారు.... ఈ రోజు ఆంధ్ర జ్యోతి నవ్య లో వచ్చిన ఆర్టికల్ చదివితే మనసు ద్రవించి పోయింది... మరీ ముఖ్యంగా సదా శివ రెడ్డి గురించి చదివాకా గుండెలను ఎవరో పిండినట్టు అయింది... ఈ సంఘటన పై అప్పట్లో నా స్పందన ఇలా కవిత రూపం లో తెలిపాను.....



http://www.andhrajyothy.com/editshow.asp?qry=/2007/sep/3vividha6

వెంటాడే జ్ఞాపకాలు...


కొందరిని జీవితంలో మర్చిపోలేం ... ఎందుకంటే మన జీవితమంతా వాళ్ళే వుంటారు కాబట్టి... నా జీవితంలో అటు వంటి వ్యక్తి శ్రీ వడ్లమూడి రామ మోహన రావు... ఆయన కనుసన్నలలో పెరిగి పెద్దవాడినయ్యాను... జీవితం గురించి, జర్నలిజం గురించి తొలి పాఠాలు నేర్చుకుంది ఆయన దగ్గరే.... ఆయన మా నుండి దూరమైన రోజు అప్పటి ఆంధ్ర జ్యోతి ఎడిటర్ రామచంద్ర మూర్తి గారి ప్రోద్బలంతో నేను రామ మోహన రావు గారికి ఇచ్చిన నివాళి ఇది...

http://www.andhrajyothy.com/editshow.asp?qry=/2007/dec/6edit4

తమిళ తెరమీద తెలుగు సిరిసిరిమువ్వ :


సినిమా రంగం చాలా చిత్రమైంది... అటువంటి సినిమా రంగంలో ఇదొక విచిత్రం ... అందమైన అమ్మాయి మూగ, చెవిటి పాత్ర పోషించవచ్చు ... అలాంటి హీరోయిన్లను మనం చూసి వుండొచ్చు ..... కాని ఈ అమ్మాయి కథ వేరు...
నిజంగా మూగ, చెవిటి అమ్మాయి రెగ్యులర్ హీరోయిన్ క్యారెక్టర్ చేసిందంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. మిత్రుడు సుబ్బారావు ఈ అమ్మాయి గురించి చెప్పినప్పుడు నిజం చెప్పొద్దూ నేను నమ్మలేదు... తమిళ్ ఫిలిం నాదూదిగల్ ప్రివ్యూ లోఈ అమ్మాయిని దూరంనుంచి చూసీ .... నమ్మలేదు....
కానీ ప్రదీప్ తో కలిసి ఆ అమ్మాయిని ఇంటర్వ్యూ చేయటానికి వాళ్ల ఇంటికి వెళ్ళినప్పుడు ఆశ్చర్యపోయాను... ఆ అమ్మాయి పట్టుదల.... ఆమె తల్లితండ్రుల ఓపిక చూసాక ముచ్చటేసింది... ఆమె భవిష్యత్తు గురించి ఫాదర్ బాగా గెస్ చేసే ఆమెకు "అభినయ" పేరు పెట్టారనిపించింది.....
వృత్తిపరంగా నాకు సంతృప్తిని కలిగించిన ఇంటర్వ్యూలలో ఇది కూడా ఒకటి... మీ అభిప్రాయాలను తెలుపండి...

Saturday, August 22, 2009

మగధీర సినిమా రివ్యూ











జాగృతి వీక్లీ లో మగధీర సినిమా గురించి నేను రాసిన రివ్యూ ఇది. చదివి మీ స్పందన తెలుపండి....




Friday, August 21, 2009

నాణానికి రెండో వైపు - కధ

హాస్యనిధి వెబ్సైటు లోనా కథ పోస్ట్ చేసారు. ఆ కథ చదివి మీ అభిప్రాయం తెలపండి.

http://www.haasyanidhi.com/stories/story.php?aid=129

http://www.haasyanidhi.com/stories/story.php?aid=130

http://www.haasyanidhi.com/stories/story.php?aid=131

నిన్నలా మొన్నలా లేదురా - కధ

కథ జగత్ వెబ్ సైట్ లో నా కథ పెట్టారు.... చదివి మీ అభిప్రాయాలూ తెలుపండి.....
http://kjomprakash.blogspot.com/

Wednesday, August 19, 2009

ఇది తొలి అడుగు ...

అందరికి నమస్తే...

ఈ రోజే మొదటి సారి బ్లాగ్ ఓపెన్ చేశాను.... మీ అందరి సహకారం కోరుకుంటున్నాను .
ఇందులో నాకధలు, కార్టూన్లు మీరు చూడొచ్చు .... తెలుగు సినిమాల మీద నా అభిప్రాయాలూ చదవొచ్చు .....
మీ సూచనలు, సలహాలు పంపండి...