Sunday, December 20, 2009

నా కార్టూన్ గురూ జయదేవ్!






కార్టూనిస్ట్ గా ఓనమాలు దిద్దుకుంది డాక్టర్ జయదేవ్ దగ్గరే. ఆయన మద్రాస్ లో.... నేనున్నది బందర్ లో! అయితే మా మధ్య పోస్టల్ సర్వీస్ బాగా నడిచేది... కార్డు మీద ఐడియాస్ పంపితే చాలా ఓపికగా వాటిని సరిచేసి పంపేవారు... ఆయన గీసిన కార్టూన్స్ చూస్తే ఇంత తేలికా కార్టూన్స్ గీయటం అనిపించేది... డెబ్బై ఏళ్ళ వయసులూ కూడా ఆయన కార్టూన్స్ గీయడం ఆనందాన్ని కలిగించడమే కాదు మాకు స్ఫూర్తి కూడా... జయదేవ్ గారి సప్తతి సందర్భంగా జరిగిన ఫంక్షన్ చిత్రాలివి!

Saturday, November 21, 2009

Monday, October 26, 2009

వండర్ కిడ్ శుభాన్విత

మా చెల్లెలు సుహాసిని కూతురు బేబి శుభాన్విత నేషనల్ లెవెల్లో బహుమతులు గెలుచుకుంది... తన గురించి సాక్షి టీవిలో వచ్చిన ప్రోగ్రాం ఇది...

http://www.sakshitv.com/watch/15/3158/wonder-kid-shubanwitha.html

Saturday, October 24, 2009

తాజా కార్టూన్లు!






మిత్రుడు మురళితో కలిసి నేను గీసిన కార్టూన్లు...

Wednesday, October 21, 2009

రామ్ గోపాల్ వర్మ "రక్త చరిత్ర"




రాం గోపాల్ వర్మ దర్శకత్వం లో త్రి భాష చిత్రం గా రూపొందుతున్న సంచలన చిత్రం రక్త చరిత్ర లో హీరోయిన్ గా ముంబై కి చెందిన రాధిక ఆప్టే ని ఎంపిక చేసారు. సినర్జీ పతాకం పై మధు మంతెన, శీతల్ వినోద్ తల్వార్ నిర్మిస్తున్న ఈ చిత్రం పై భారి అంచనాలు ఉన్నాయ్. వివాదాల నడుమ తెరకెక్కుతున్న ఈ సంచలన చిత్రం లో హీరోయిన్ గా నటిస్తున్న రాధిక ఆప్టేకు, పరిటాల సునీతకు పోలికలు వున్నాయేమో చూడండి.... ఈ సినిమాలో పరిటాల రవిగా హిందీ నటుడు వివేక్ ఒబెరాయ్, మద్దిల చెరువు సూరిగా సూర్య నటిస్తున్నారు....

Friday, October 2, 2009

సెక్యూలర్ భారత్ - కార్టూన్లు


మన భారత దేశంలో సెక్యూలర్ అనే పదానికి ఎవరికీ తోచిన అర్ధం వారు చెబుతుంటారు... దాని మీద గీసిన కార్టూన్లు ఇవి.....

Sunday, September 20, 2009

లోకల్ ట్రైన్ బాగోతం - కార్టూన్లు!


ముంబాయిలో వుద్యోగం చేసిన సమయంలో లోకల్ ట్రైన్ అనుభవాన్ని ఇలా కార్టూన్ రూపంలో కాగితంపై పెట్టాను... ఇప్పుడు ఈ పరిస్థితి హైదరాబాద్ లోను వుంది...

ఈనాడు ఫిలిం రివ్యూ






Wednesday, September 16, 2009

లేడీ కండక్టరు!

హైదరాబాద్ లో లేడీ కండక్టర్ లను అపాయింట్ చేసినప్పుడు గీసిన కార్టూన్లు...

'ఆత్మావలోకనం' కధ




ఈనాడు ఆదివారం అనుబంధం లో ప్రింట్ అయిన కధ...