Sunday, June 5, 2011

Bapu gari bommala koluvu

బాపు బొమ్మల కొలువు సూపర్ హిట్
ఇంకొక్క రోజు ఉండగానే ఎలా డిక్లేర్ చేస్తావ్ అని అడక్కండి... సినిమాకు వచ్చే ఓపెనింగ్స్  బట్టే కదా హిట్టో ఫట్టో చెప్పేది... అలా చూస్తే బాపు గారి బొమ్మల కొలువు సూపర్ హిట్టే... ఓపెనింగ్ అదిరింది.
అక్కినేని గారు ఓకే... ఊహించని విధంగా బాలయ్య బాబు వచ్చేశారు... అంతా శ్రీరామ రాజ్యం మహిమ...
ఇక వారి స్పీచిలన్నీ ఎంతబాగున్నాయో చెప్పలేను. సారీ చెప్పగలను... బాపు బొమ్మలంత బాగున్నాయి!
బోలెడంతమంది స్టాండింగ్ ఒవేషన్ ఇస్తుంటే బాపుగారు తెగ సిగ్గుపడిపోతూ 'రేఖా చిత్ర కళా చక్రవర్తి' బిరుదు అందుకున్నారు. వచ్చిన వాళ్ళంతా బాపు బొమ్మల కొలువు చూసి తరించారు...
ఇంతకీ ఎందుకు సూపర్ హిట్ అన్నానంటే...
రెండో రోజు మధ్యాహ్నం ఒంటి గంటకు బొమ్మల కొలువుకు వెళుతూ... బాపుగారి సినిమా ఆడే ధియేటర్లా  ఖాళీగా ఉంటుందేమో అనుకున్నా..... (నేరం నాది కాదు... ఆయనే ఓ కార్టూన్లో ఉవాచించారు... కావాలంటే కింద చూడండి) కాని ఊహించని విధంగా బోలెడంత మంది ఉన్నారు.
బాపు గారి సినిమా ఫెయిల్ కావచ్చేమో కాని బొమ్మ కాదని నిరూపణ అయింది.
బాపు గారికి జై..
బాపు బొమ్మకు జైజై...
ఆ బొమ్మల కొలువుకు వచ్చిన వారికి, రాబోతున్న వారికి జైజైజై!