Saturday, June 16, 2012

మచిలీపట్నం క్రోక్విలర్స్

హాస్యప్రియ పత్రిక చేసిన గొప్ప మేలు ఏమిటంటే.. ఒక ఊరిలోనే వుండే కార్టూనిస్టులను ఒక చోట చేర్చింది. ఊరి పేరుతో ఆరుగురు కలిసి ఫుల్ పేజి కార్టూన్ గీయడం నేను ఆ పత్రికలోనే చూశాను. సింహపురి క్రోక్విలర్స్ కార్టూన్ షీట్ చూసినప్పుడే, నెల్లూరు ని సింహపురి అంటారని తెలిసింది. వైజాగ్ వాళ్ళు 'స్టిల్ సిటీ క్రోక్విలర్స్' పేరుతో కార్టూన్ షీట్ గీసే వారు. మావూరి లోని కార్టూనిస్టులతోనూ ఇలా ఎందుకు చేయకూడదు అనిపించింది. ఆ ఆలోచనకు ప్రతిరూపమే ఈ ఫుల్ పేజీ కార్టూన్. చండికతో ముఖ పరిచయం వుంది. శేఖర్ ప్రసాద్ ఎవరో తెలియదు. ఇక యర్రంశెట్టి (పాండురంగారావు) నా బాల్య మిత్రుడు. ఇప్పుడు ఏలూరులో ఫుడ్ ఇన్స్పెక్టర్ గా పని చేస్తున్నాడు. సుహాసిని... నా చెల్లెలు. ప్రస్తుతం ఐ.జి. ప్రిజన్స్ లో ఓ.ఎస్., ఇక కుంచే మురళి గురించి కొత్తగా చెప్పేదేమీ లేదు.